Tuesday, 15 May 2012

పంటి నొప్పితో బాధపడుతుంటే.....

పంటి నొప్పితో బాధపడుతుంటే రెండు తులసి ఆకులతో పాటు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకుని మూడింటిని కలిపి పంటి కింద రెండు నిమిషాల పాటు అదిమి పెడితే ఉపశమనంగా ఉంటుంది.

Saturday, 5 May 2012

మ్యాంగో ఖీర్

కావలసిన పదార్థాలు
పాలు: 1cup
బియ్యం: 1tsp
పంచదార: 1tsp
మామిడిపండ్లు: 2
ఏలకులపొడి: 1tsp
బాదంపప్పు: 1/2tsp
కుంకుమపువ్వు: కొద్దిగా
రోజ్ వాటర్: 1tsp
మామిడిపండు గుజ్జు: 2tbsp
జీడిపప్పు పలుకులు (వేయించినవి): 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పాలు, బియ్యం, పంచదార కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
2. తర్వాత ముందుగా తీసుకొన్న రెండు మామిడిపండ్ల పై తొక్క తీసి, తురమాలి.
3. ఇప్పుడు రైస్ ఖీర్‌ ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, అందులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు తురుము, రోజు వాటర్, కుంకుమ పువ్వు, ఏలకులపొడి వేసి కలపాలి. పైన జీడిపప్పు, బాదంపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
4. చల్లగా, తియ్యగా, మృదువుగా, రుచిగా ఉండే ఈ ఖీర్‌ను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. ఈ వేసవిలో వారికిది బలవర్ధకమైన ఆహారం కూడా. (పంచదారకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు)

Friday, 4 May 2012

ఆనియన్ బిర్యానీ

కావలసినవి:
బాస్మతి రైస్: 2cups
నెయ్యి: 2tbsp
పచ్చిమిర్చి: 4-6
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీలకర్ర: 1tsp
మిరియాలు: 1tsp
లవంగాలు: 4-6
ఏలకులు: 2-3
బిర్యానీ ఆకు: 2
ఉల్లిపాయ ముక్కలు: 2cups
చిన్న ఉల్లిపాయలు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
తరిగిన కొత్తిమీర: 1/2cup
గార్నిష్ చేయడానికి: నేతిలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా

తయారు చేయు విధానం:
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రం చేసి, తగినన్ని నీళ్ళు పోసి, కొంచెం పలుకుగా అన్నం వండి చల్లారనివ్వాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేడి చేసి పచ్చిమిర్చి జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
3. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలను వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.
4. ఇప్పుడు అన్నం, ఉప్పు వేసి కలిపి దించేయాలి. నేతిలో వేయించిన ఉల్లిపాయముక్కలు, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

Wednesday, 2 May 2012

చుండ్రు సమస్యకు పరిష్కారమార్గాలు

వేసవిలో దుమ్ము, దూళి, కారణంగా ఎంత వద్దనుకొన్నా వేధించే సమస్య చుండ్రు.. చిట్కా వైద్యాలు మొదలుకొని వైద్యుల సాయంతో చికిత్సలు తీసుకొన్నా సరే చుండ్రుని తప్పించుకోవడం కష్టమే! అనిపిస్తోందా? అయితే ఆహార నియమాలు.. చిన్నపాటి జాగ్రత్తలతో చుండ్రుని అరికట్ట వచ్చంటున్నారు నిపుణులు.

  • గుప్పెడు మెంతులని రాత్రంతా నానబెట్టి తెల్లారి మెత్తగా రుబ్బి తలకి పట్టించాలి. ఇరవై నిమిషాల య్యాక, కుంకుడుకాయ రసంతో తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
  • తల స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసినా మంచిదే. చుండ్రుకి కొబ్బరి నూనె చక్కని పరిష్కారం.
  • తల పొడిబారి దురదతో సతమతమయ్యే వారికి నిమ్మనూనె చక్కని ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తలకు పట్టించడం వల్లా ఫలితం ఉంటుంది.
  • శిరోజాలు వత్తుని బట్టి గుడ్డులోని తెల్ల సొనలని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్ని జోడించాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంటపాటు ఉంచి నిమ్మ సుగుణాలున్న సబ్బుతో తలస్నానం చెయ్యాలి. చుండ్రు నెమ్మదిగా నియంత్రణలోకి వస్తుంది.
  • చెంచా ఆలివ్‌ నూనె, చెంచా బాదం నూనె రెండింటిని కలిపి తలకు పట్టించాలి. పావుగంట తర్వాత కడిగి తలస్నానం చేస్తే కొన్ని వారాల్లోనే చుండ్రు బాధ తగ్గుతుంది.
  • వేపుళ్లని తగ్గించి ఆహారంలో తాజా పండ్లు, కాయగూరలని తినడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. నాణ్యతలేని రకరకాల జెల్‌లు, షాంపూల వాడకం కూడా చుండ్రు తీవ్రతను పెంచుతుందని గుర్తుంచు కోవాలి.
Related Posts Plugin for WordPress, Blogger...